వాహనం బోల్తా.. పరిగి ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:09 PM
వికారాబాద్ జిల్లాలోని పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్సై సత్యనారాయణతోపాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
వికారాబాద్, నవంబర్ 09: జిల్లాలోని పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్సై సత్యనారాయణతోపాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. వారిని పరిగిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వారు బందోబస్తు విధులకు హాజరయ్యారు. అనంతరం పరిగికి వారు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పల్టీ కొట్టి.. కల్వర్టులను ఢీకొట్టిందని పోలీసులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కష్టపడుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
Read Latest Telangana News And Telugu News