Share News

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 06:07 PM

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

హైదరాబాద్, నవంబర్11: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కనిష్ఠంగా కిలో బియ్యం ధర రూ.66గా.. గరిష్ఠంగా రూ.79గా నిర్ణయించింది.


హెచ్ఎంటీ, జేఎస్ఆర్ (HMT, JSR) బియ్యం గరిష్ఠ ధర రూ.79గా నిర్ణయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామని బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లు యజమానులను హెచ్చరించింది. BPT KNM ధర రూ.66, తెలంగాణ సోనా రూ.74, HMT రకం రూ.79గా నిర్ణయించినట్లు వెల్లడించింది.


బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు: చీఫ్ రేషనింగ్ ఆఫీసర్

రాష్ట్రంలో బియ్యం కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. బియ్యం బస్తాపై ఎమ్మార్పీ (MRP) దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టించే దళారులపై నిఘా ఉంచామని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించారు.


పదేపదే అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రిటైలర్లకు నేరుగా రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. 25 కిలోల బస్తాపై 26 కిలోల స్టిక్కర్ వేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. నకిలీ ఎమ్మార్పీ (MRP) స్టిక్కర్లతో అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కేసులు పెడతామని తెలిపారు.


BPT, KNM బియ్యం కిలో గరిష్ట ధర రూ.66, RNR, తెలంగాణ సోనా కిలో గరిష్ట ధర రూ.74, HMT, JSR బియ్యం కిలో గరిష్ట ధర రూ.79గా నిర్ణయించినట్లు వివరించారు. ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. వినియోగదారులు మోసపోకుండా ప్రభుత్వ చర్యలు చేపట్టిందని తెలిపారు. అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలంగాణ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. యువకుడి అరెస్ట్

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 06:23 PM