Share News

గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. యువకుడి అరెస్ట్

ABN , Publish Date - Nov 09 , 2026 | 04:12 PM

హైదరాబాద్ గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న లిమ్మక అనంత్ కుమార్(28)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 35 తులాల బంగారం, 2 కిలోల వెండితోపాటు యాక్టివా వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. యువకుడి అరెస్ట్

హైదరాబాద్, నవంబర్ 11: నగరంలోని గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న లిమ్మక అనంత్ కుమార్(28)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 35 తులాల బంగారం, 2 కిలోల వెండితోపాటు యాక్టివా వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అన్‌లైన్ బెట్టింగుల ద్వారా భారీగా అప్పుల పాలైనట్లు తమ విచారణలో నిందితుడు వెల్లడించాడని తెలిపారు.


ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అతడు ఈ చోరీల బాట పట్టినట్లు చెప్పారని పోలీసులు వివరించారు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నవంబర్ 2వ తేదీన కొండాపూర్‌ శిల్పా వ్యాలీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. ఈ ఇంట్లోని అల్మారాలో 35 తులాల బంగారంతోపాటు 2 కిలోల వెండిని అతడు దొంగిలించాడు.


దీంతో బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా చోరీ జరిగిన అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. టెర్రస్ మీద నుంచి తాడు ద్వారా నిందితుడు బాల్కనీలోకి దిగి స్లైడింగ్ డోర్ పగులగొట్టి.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో గచ్చిబౌలి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులకు అనంత్ కుమార్ చిక్కాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి.. వ్యాపారి అరెస్ట్

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 04:27 PM