పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి.. వ్యాపారి అరెస్ట్
ABN , Publish Date - Nov 09 , 2026 | 03:45 PM
హైదరాబాద్ నగరంలో కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం పోచారంలోని పాల తయారీ కేంద్రంపై సోమవారం అధికారులతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 09: నగరంలో కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం పోచారంలోని పాల తయారీ కేంద్రంపై సోమవారం అధికారులతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. పాల తయారీ కేంద్రంలోని యంత్రాలను సీజ్ చేశారు.
పాల వ్యాపారిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వినియోగించి.. ఈ కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు తమ విచారణలో పాల వ్యాపారి వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ కల్తీ పాలను హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడని పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు
For More TG News And Telugu News