Share News

మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు

ABN , Publish Date - Nov 09 , 2026 | 03:45 PM

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుతో వర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యకు నోటీసులు జారీ అయ్యాయి.

మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు
Telangana Women Commission

హైదరాబాద్, నవంబర్ 9: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుతో వర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 12 వ తేదీన విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. వీసీ అల్డాస్ జానయ్య తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణకు హాజరుకావాలని వీసీకి నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ చేసిన ఆరోపణలపై వీసీ వివరణ అనంతరం తదుపరి చర్యలపై మహిళా కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


tgswv.jpg


ఇవి కూడా చదవండి...

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

‘నాకు బతకాలని లేదు.. చెల్లిని జాగ్రత్తగా చూసుకో’.. తల్లికి మెసేజ్ పెట్టి యువకుడి అదృశ్యం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 03:49 PM