ప్రతీ ఇద్దరిలో ఒకరు..
ABN , Publish Date - Sep 08 , 2026 | 08:09 AM
మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజలు అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మద్యానికి బానిసలుగా..
పట్టణ ప్రాంతాలతో గ్రామీణం పోటీ
మేడ్చల్ జిల్లాలో 47.5 శాతం మంది మహిళలకు ఊబకాయం
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజలు అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి చేరువగా ఉండటంతో ఇక్కడి ప్రజలు కార్పొరేట్ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో మద్యం, ధూమపానం సేవించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రతీ ఇద్దరిలో ఒకరు మద్యం తాగుతున్నట్లు ఉంది. 15 ఏళ్లకు పైబడిన వారిని సర్వే చేయగా జిల్లాలో మద్యం తాగేవారి సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది.
49.9 శాతం
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 49.9 శాతం మద్యం సేవిస్తున్నారు. మూడేళ్ల కిందట సర్వేతో పోలిస్తే మద్యం తాగే వారు మూడు శాతం పెరగడం గమనార్హం. మహిళల్లో 12.9శాతం మంది మద్యం సేవిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో 31.4శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. అలాగే 9.7శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు.
అలాగే పురుషుల్లో 9.6శాతం మంది ధూమపానం సేవిస్తుండగా మహిళలు 2.1శాతం మంది ధూమపానం సేవిస్తున్నారు. అలాగే మేడ్చల్ జిల్లాలో అధికంగా 47.5శాతం మంది మహిళలు ఊబయకాయంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో సగటు కంటే 13.3శాతం మంది మహిళలు బరువు తక్కువగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 36.8 శాతం మంది మహిళలు ఉబయకాయం బారిన పడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News