Share News

శనివారం వరకూ సభ

ABN , Publish Date - Sep 08 , 2026 | 07:02 AM

శాసనసభ సమావేశాలను శనివారం దాకా నిర్వహించాలని, కాళేశ్వరం, కృష్ణ-గోదావరి జలాలు, విద్య, 22-ఏ తదితర అంశాలపై చర్చించాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన భేటీ అయిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది.

శనివారం వరకూ సభ
Telangana Assembly

  • గోదావరి జలాలు, విద్య, 22-ఏ,కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చ

  • శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాలను శనివారం దాకా నిర్వహించాలని, కాళేశ్వరం, కృష్ణ-గోదావరి జలాలు, విద్య, 22-ఏ తదితర అంశాలపై చర్చించాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన భేటీ అయిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో శనివారం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ బలాలా పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరగా.. ఐదు రోజుల పాటు సభ నిర్వహిద్దామని, అవసరమైతే శనివారం మరో సారి బీఏసీ నిర్వహించి నిర్ణయిద్దామని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. 22 -ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరు గ్యారెంటీల అమలు, వ్యవసాయం సహా 26 అంశాలపై చర్చించాలని మహేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించగా.. మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ 22-ఏపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెప్పారు. 22-ఏ విషయంలో తప్పు జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అంగీకరించిన నేపథ్యంలో మొదట న్యాయ విచారణకు ఆదేశించిన తర్వాతే ఈ అంశంపై చర్చ పెట్టాలని ఏలేటి సూచించారు. అనివార్య కారణాల వల్ల బీఏసీ సమావేశానికి హాజరు కాలేదని సీపీఐ పేర్కొనగా, ఈ సమావేశాన్ని తాము బహిష్కరించినట్లు బీఆర్‌ఎస్‌ వెల్లడించింది.


మండ లిలో కానరాని మజ్లిస్‌ బహిష్కృత ఎమ్మెల్సీ బేగ్‌

మజ్లిస్‌ బహిష్కృత ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌ ఆచూకీ సోమవారం కూడా తెలియరాలేదు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్‌ హసన్‌ ఎఫెందీ ఒక్కరే కనిపించారు. మండలి బీఏసీకి సైతం ఎఫెందీ ఒక్కరే ఆ పార్టీ నుంచి హాజరయ్యారు. రహ్మత్‌ బేగ్‌ బాలికతో శృంగారం చేస్తూ... వీడియోల్లో దొరికిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బేగ్‌ను బహిష్కరించింది.. రాజీనామా చేయించాలని శతవిధాలా ప్రయత్నించినట్లు... ఆయన తప్పించుకొని పారిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆపార్టీ అదుపులోనే బేగ్‌ ఉన్నారని, ప్రస్తుతం మళ్లీ సౌదీకి వెళ్లినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..
తలపై కొట్టి చంపి.. ఇనుప పెట్టెలో కుక్కి..

60 మందితో పార్టీ.. అరవింద సమేత!
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 07:02 AM