Share News

తలపై కొట్టి చంపి.. ఇనుప పెట్టెలో కుక్కి..

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:39 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రానికి చెందిన ఎండీ బురానుద్దీన్‌(49) కుటుంబ కలహాలతో తన సొంత ఇంటిలోనే మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తలపై కొట్టి చంపి.. ఇనుప పెట్టెలో కుక్కి..
Buranuddin

  • సొంతింట్లోనే వ్యక్తి దారుణ హత్య

  • భార్య, కుమారులపై అనుమానం

అమ్రాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రానికి చెందిన ఎండీ బురానుద్దీన్‌(49) కుటుంబ కలహాలతో తన సొంత ఇంటిలోనే మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి భార్య సఫియా, ఇద్దరు కుమారులు ఇలియాజ్‌, ఖదీర్‌లు కలిసి బురానుద్దీన్‌ను ఇంటిలోనే తలపై దారుణంగా కొట్టి చంపేశారు. మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి పెద్ద ఇనుపపెట్టెలో కుక్కి ఇంటిలోని ఓ మూలన ఉంచారు. వాసన రాకుండా పౌడర్‌ చల్లారు. శుక్రవారం నుంచి బురానుద్దీన్‌ ఫోన్‌ చేయడం లేదని అచ్చంపేటలో నివాసం ఉంటున్న ఆయన అక్కలు సమాచారం ఇవ్వడంతో స్థానికులు ఆదివారం రాత్రి ఆయన ఇంటి వద్దకు వెళ్లి చూడటంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇంటికి తాళం వేసి రెండు రోజుల నుంచి పరారీలో ఉన్నారు. తమకు అత్యవసరం అని స్థానికుల నుంచి రూ. 70 వేలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హతుని అక్క కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హనుమంతురెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలాఉండగా భార్యాభర్తలు, కుమారుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేస్తారా?
మోదీ ఓటమికి సర్‌లోనే పునాది

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 06:39 AM