కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్లు
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:20 AM
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయి ప్రసాద్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కాకినాడ, సెప్టెంబర్ 08: జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయి ప్రసాద్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పంపారు. వైసీపీ వీడేందుకు అందులోని కారణాలను వారు.. ఆ లేఖలో వివరించినట్లు సమాచారం.
వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు నెక్కంటి సాయి ప్రసాద్.. రాసిన లేఖలో స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో పలు పట్టణాల్లోని మరికొంత మంది వైసీపీ కౌన్సిలర్లు కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారాంతా జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఆ తర్వాత పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడారు. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అలాంటి వేళ.. వైసీపీకీ మరింత మంది రాజీనామా చేస్తారనే ప్రచారం వెల్లువెత్తుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
అమరావతిని మారుస్తామనడం అవివేకం
For More AP News And Telugu News