Home » Jaggampeta
కాకినాడ జిల్లా వైసీపీలో మరో ముసలం ముదిరింది. ఇప్పటికే ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఆరని పేచీలతో తలపట్టుకుంటున్న అధిష్ఠానానికి తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి తోటనరసింహం పావులు కదుపుతుండడంతో పార్టీలో వర్గాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనదేనంటూ తోట ఎక్కడి కక్కడ వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండడం నియోజక వర్గంలో కాకరేపుతోంది.
జగ్గంపేట నియోజవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో నియోజవర్గ గ్రామాల్లో పర్యటిస్తారని టీడీపీ నేతలు ప్రకటించారు.