Chandrababu: జగ్గంపేట నియోజవర్గంలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-02-03T17:38:58+05:30 IST

జగ్గంపేట నియోజవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో నియోజవర్గ గ్రామాల్లో పర్యటిస్తారని టీడీపీ నేతలు ప్రకటించారు.

Chandrababu: జగ్గంపేట నియోజవర్గంలో చంద్రబాబు పర్యటన

కాకినాడ: జగ్గంపేట నియోజవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో నియోజవర్గ గ్రామాల్లో పర్యటిస్తారని టీడీపీ నేతలు ప్రకటించారు. ఈనెల 14న మధురపూడి విమనాశ్రయంలో దిగి.. గోకవరంలో "ఇదేం ఖర్మ రా!" మన రాష్ట్రానికి కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం జగ్గంపేట (Jaggampeta)లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం, స్మారక మందిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) గెస్ట్హౌస్లో బస చేస్తారు. 15న జగ్గంపేట నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెద్దాపురం నియోజవర్గం పర్యటనకు పయనమవుతారు.

Updated Date - 2023-02-03T19:04:20+05:30 IST