Share News

గోపిక వేషంలో ముస్లిం బాలిక

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:31 AM

పిల్లలూ దేవుడు చల్లనివారు.. కల్లకపటమెరుగనీ కరుణామయులు అన్న ఓ సినీకవి మాటలు నిజంగా ఎంత నిజం!! ఆ ముస్లిం బాలిక బడిలో తోటి పిల్లలను కృష్ణుడు, గోపిక వేషాల్లో చూసి.. తానూ గోపికగా మారతానంటూ అడిగింది.

గోపిక వేషంలో ముస్లిం బాలిక
Muslim Girl

  • తోటి పిల్లలను చూసి నేనూ గోపికగా

  • తయారవుతానని బాలిక మారాం

  • మన్నించి మన్ననలు పొందిన తల్లిదండ్రులు

వికారాబాద్‌, షాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలూ దేవుడు చల్లనివారు.. కల్లకపటమెరుగనీ కరుణామయులు అన్న ఓ సినీకవి మాటలు నిజంగా ఎంత నిజం!! ఆ ముస్లిం బాలిక బడిలో తోటి పిల్లలను కృష్ణుడు, గోపిక వేషాల్లో చూసి.. తానూ గోపికగా మారతానంటూ అడిగింది. మారాం చేసింది. తల్లిదండ్రులకు ఒప్పుకోక తప్పింది కాదు!! అబ్బా జాన్‌.. అమ్మీ జాన్‌ తనను అలానే తీర్చిదిద్దేసరికి గోపిక వేషంలో తనను తాను చూసుకొని ఆ బేటీ ఎంతగానో మురిసిపోయింది! కృష్ణాష్టమి సందర్భంగా గురువారం వికారాబాద్‌లోని సెయింట్‌ ఆంటోనీ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఈ ఘటన అందర్నీ ఆకర్షించింది. మతాలనేవి సమాజాన్ని విడగొట్టే గోడలు కావని.. దూదిపింజల్లా అలా తేలిపోయే గాలి మబ్బులని ఆ ముస్లిం బాలిక చాటిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తమ పాప మాటను మన్నించి.. ఆ వేషం వేయించిన తల్లిదండ్రులను అక్కడివారంతా అభినందించారు. రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండల పరిధిలోని ఎల్గొండగూడ ప్రాథమిక పాఠశాలలోనూ ముస్లిం పిల్లలు కృష్ణుడు, గోపిక వేషధారణలో ముస్తాబై అలరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొండా సురేఖ బర్తరఫ్‌.. స్వయంకృతాపరాధమే!

బకెట్‌లో 160 డిటోనేటర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:31 AM