రేషన్ బియ్యానికి పాలిష్
ABN , Publish Date - Nov 05 , 2026 | 10:29 AM
రంగారెడ్డి జిల్లా మంచాలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాల్లో 150 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం పట్టుబడింది.
మంచాలలో రాఘవేంద్ర రైస్‌మిల్లులో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు
150 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
వివిధ రకాల బ్రాండ్ల పేరిట బస్తాల్లో ప్యాకింగ్
లైసెన్స్, జీఎస్టీ అనుమతులు లేకుండానే రైస్‌మిల్ నిర్వహణ
మంచాల/ఆదిభట్ల(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా మంచాలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాల్లో 150 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం పట్టుబడింది. ఎస్పీ రాంకుమార్, డీఎస్పీ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం మంచాలలోని రాఘవేంద్ర రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లు యాజమాన్యం రేషన్‌బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా మారుస్తూ బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు వారు గుర్తించారు.
రైస్‌మిల్లులో పాలి్‌షచేసి వివిధ బ్రాండ్లలో ప్యాకింగ్ చేసిన 50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం, సమీపంలోని గోదాములో నిల్వ ఉంచిన మరో 100 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్‌పీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు రాఘవేంధ్ర రైస్‌మిల్లులో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో పాలిష్ చేసిన పీడీఎస్ బియ్యం మిక్స్‌చేసి 20 రకాల లేబుల్ బ్రాండ్లు కలిగిన బస్తాల్లో నింపి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించామని తెలిపారు.
ఇంకా రైస్‌మిల్ ఎదురుగా ఉన్న గోదాములో అక్రమంగా నిల్వఉంచిన 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్‌చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రైస్‌మిల్లు యాజమాన్యం ఎలాంటి లైసెన్స్, జీఎస్టీ, ట్యాక్సుల నిర్వహణ లేకుండా అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని వివరించారు. విచారణ జరిపి రైస్‌మిల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోదాల్లో డీఎస్వో వనజాత, సుధాకర్, మంచాల సీఐ మధు తదితరులు పాల్గొన్నారు.
పోచారం రైస్‌మిల్లులపై..
ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు బుధవారం అకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలో రైస్ మిల్లులో నిర్వహించే తూకం మిషన్‌కి లైసెన్స్ లేకపోవడం 20 కిలోల మిషన్, 50 కిలోల మిషన్ లేకపోవడం, రైస్‌మిల్లు ఆవరణలోని వేబ్రిడ్జీలో ఉండాల్సిన బాట్లు లేకపోవడంతో లీగల్ మెట్రాలజీ అధికారులు రైస్ మిల్లుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో డిప్యూటీ తహాసీల్డార్ రామకృష్ణ, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, విజిలెన్స్ సీఐ పాండారి, మహేష్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గురుకుల ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News