Share News

ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులకు పురుగులు పడ్డ అన్నం

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:47 AM

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో బుధవారం కలుషితాహారం తినడం వల్ల ఏడుగురు విద్యార్థినులు వాంతులు, తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు.

ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులకు పురుగులు పడ్డ అన్నం

  • తిన్న వారిలో కొందరికి వాంతులు, తీవ్ర కడుపు నొప్పి

  • ఏడుగురికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స

  • హాస్టల్‌ను తనిఖీకి చేసేందుకు వెళ్లిన తహసీల్దార్‌

  • అరగంట పాటు తలుపు తీయని సిబ్బంది

  • ఆలోపు పురుగులున్న పులిహోర పడేసి పాత్రలు శుభ్రం!

  • సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం జోగిపేటలో ఘటన

జోగిపేట రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో బుధవారం కలుషితాహారం తినడం వల్ల ఏడుగురు విద్యార్థినులు వాంతులు, తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు. హాస్టల్‌లో 70 మంది విద్యార్థినులు ఉంటున్నారు. బుధవారం ఉదయం వారికి పులిహోర వడ్డించారు. అందులో పురుగులు ఉన్నాయని కొందరు తినలేదు. తిన్నవారిలో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.


ఫుడ్‌ పాయిజనింగ్‌ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ మధుకర్‌రెడ్డి ఎస్‌ఐ శ్రీకాంత్‌తో కలిసి హాస్టల్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లగా అక్కడ సిబ్బంది అరగంట పాటు హాస్టల్‌ తలుపు తీయలేదు. వారు లోపలే ఉండి, మిగిలిన విద్యార్థులను కూడా లోపలే ఉంచి అటు వైపు నుంచి తాళం వేసుకున్నారు. అరగంట సేపు తలుపు కొట్టిన తర్వాత అప్పుడు తీశారు. ఆలోపు పులిహోరను పడేసి, వంట పాత్రలను శుభ్రం చేశారని తెలుస్తోంది. హాస్టల్‌లో రోజూ పురుగుల అన్నం పెడుతున్నారని విదార్థినులు ఆరోపించారు. అన్నంలో పురుగులు, నాసిరకం ఆహారపదార్థాలపై వార్డెన్‌ సబిత, వంట మనిషి అనురాధకు ఫిర్యాదు చేస్తే.. ‘‘హాస్టల్‌ భోజనం ఇలాగే ఉంటుంది. సర్దుకుని తినండి. లేదంటే హాస్టల్‌ నుంచి వెళ్లిపోండి’’ అంటూ బెదిరించారని వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అఖిలేశ్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం హాస్టల్‌లో తనిఖీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:20 AM