Share News

‘నాలాపై జన్వాడ ఫాంహౌస్ నిర్మాణం’.. కాంగ్రెస్ ఎంపీల సంచలన కామెంట్స్

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:58 PM

జన్వాడ ఫాంహౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ నిర్మాణానికి అనుమతులు లేవని, నాలాపై ఫాంహౌస్‌ను కట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

‘నాలాపై జన్వాడ ఫాంహౌస్ నిర్మాణం’.. కాంగ్రెస్ ఎంపీల సంచలన కామెంట్స్
Janwada farmhouse

రంగారెడ్డి, సెప్టెంబర్ 19: జన్వాడ ఫాంహౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ నిర్మాణానికి అనుమతులు లేవని, నాలాపై ఫాంహౌస్‌ను కట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈరోజు(శనివారం) కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం జన్వాడ ఫాంహౌస్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫాంహౌస్‌ భూములను ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. అక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే జన్వాడ ఫాంహౌస్‌కు వచ్చామని తెలిపారు. ఫాంహౌస్‌ను నాలాపై కట్టారని.. దీని నిర్మాణానికి అనుమతులు లేవన్నారు. ఫాంహౌస్ ఎవరి పేరుపై ఉందో స్పష్టత లేదని మల్లు రవి అన్నారు.


ఇన్ని ఎకరాల్లో ఫాంహౌస్‌ ఎలా కట్టారు: చామల

ఫాంహౌస్‌ దగ్గరకు వస్తే ప్రదీప్‌రెడ్డి కేసులు పెడతామన్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. అసలు ఇన్ని ఎకరాల్లో ఫాంహౌస్ ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. జన్వాడ ఫాంహౌస్ దగ్గర డ్రోన్ ఎగరవేస్తే రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టారని మండిపడ్డారు. కేటీఆర్ స్నేహితుడే ప్రదీప్‌రెడ్డి అని.. ఆయనకు ఫాంహౌస్ భూమి ఎలా వచ్చిందని నిలదీశారు. కేటీఆర్ జన్వాడ ఫాంహౌస్‌లో అద్దెకు ఉంటున్నారని ప్రదీప్ చెప్పారని తెలిపారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అక్రమంగా జన్వాడలో ఫాంహౌస్ నిర్మించారని ఆరోపణలు గుప్పించారు. సత్యం రామలింగరాజు భూముల్లో ఫాంహౌస్ నిర్మించారని తెలిపారు. కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో ఇక్కడ భూమి ఉందన్నారు. కేటీఆర్ అత్త పేరుపై కూడా భూములు ఉన్నాయని చెప్పారు. ఈ భూమలన్నీ శతబిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీవి అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.


ఫాంహౌస్‌ వద్ద ఉద్రిక్తత

జన్వాడ ఫాంహౌస్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫాంహౌస్‌ భూములను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతల బృందాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో హైటెన్షన్ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు

రేవంత్-కేటీఆర్ మైత్రి ఏంటో ప్రజలకు తెలుసు: బండి సంజయ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 03:41 PM