హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:06 PM
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన ఘటనలో హోంగార్డ్‌పై వేటు పడింది. హోంగార్డ్ ఆనంద్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన ఘటనలో హోంగార్డ్‌పై వేటు పడింది. హోంగార్డ్ ఆనంద్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్‌కు చెందిన తెలంగాణ పోలీస్ హోంగార్డ్‌ను డిస్మిస్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మహిళపై దాడి ఘటనలో ఆనంద్‌పై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
డీజీపీ సీరియస్..
మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డ్ ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News