Share News

రేవంత్-కేటీఆర్ మైత్రి ఏంటో ప్రజలకు తెలుసు: బండి సంజయ్

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:31 PM

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మైత్రి ఏంటో ప్రజలకు తెలుసన్నారు.

రేవంత్-కేటీఆర్ మైత్రి ఏంటో ప్రజలకు తెలుసు: బండి సంజయ్
Bandi Sanjay

హైదరాబాద్, సెప్టెంబర్ 19: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మైత్రి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. సర్వే నంబర్లతో సహా చెప్పి కేటీఆర్ బాధపడకుండా ఉండేలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా పొలిటికల్ డ్రామాలు చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్సీలను పంపి తమాషాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వాళ్లు వెళ్లేది ఎందుకు హద్దులు కొలవడానికా అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ముడుపులు ముట్టక సమస్య సైడ్ ట్రాక్ అవుతోందని అన్నారు. ముందు కేసీఆర్‌ కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.


కేటీఆర్ సుద్దపూస మాటలు ఆపాలని కేంద్ర మంత్రి అన్నారు. పొత్తూర్ లాజిస్టిక్ పార్క్ నడుపుతోంది కేటీఆర్ అని.. కొంతమందితో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుతున్నారని తెలిపారు. ఖానాపూర్‌లో టికెట్ మార్చడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఒకప్పుడు ఆంధ్ర అడ్వాకేట్లు అన్న కేటీఆర్.. ఇప్పుడు వాళ్లతోనే ఎందుకు గడుపుతున్నారని నిలదీశారు. ఈరోజు రోజ్‌గార్ మేళా ద్వారా రెండు వందల మందికిపైగా ఉద్యోగ పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో నిరుపేద బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యం అవుతుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఆ ఎన్నికలో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 02:59 PM