Share News

మత్తు ఇచ్చి.. చున్నీతో కట్టేసి..

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:31 AM

మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగించి స్పృహ కోల్పొయిన ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు.

మత్తు ఇచ్చి.. చున్నీతో కట్టేసి..

  • దివ్యాంగురాలిపై ఇద్దరి అత్యాచారం

  • రంగారెడ్డి జిల్లాలో ఘటన

అబ్దుల్లాపూర్‌మెట్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగించి స్పృహ కోల్పొయిన ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టుకతోనే దివ్యాంగురాలైన బాధితురాలు(37) హయత్‌నగర్‌లోని లెక్చరర్స్‌ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లి అబ్దుల్లాపుర్‌మెట్‌ శివారులోని కొత్తగూడెంలో హోటల్‌ నిర్వహిస్తోంది.


ఆ హోటల్‌కు తరచూ వచ్చే ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ జావేద్‌ (37).. బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. 14న సాయంత్రం బాధితురాలు తన కుమారుడిని కొత్తగూడేనికి పంపించేందుకు హయత్‌నగర్‌లో బస్‌ ఎక్కించింది. తిరిగి తన ఇంటికి వెళ్తుండగా.. అటుగా వచ్చిన సయ్యద్‌ జావేద్‌ ఆమెను ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన బాధితురాలిని బాటసింగారంలోని ఓ గదిలో బంధించాడు. ఆమె చేతులను చున్నీతో కట్టేసి బాటసింగారంకు చెందిన మరో వ్యక్తి వెంకటేశ్‌తో కలిసి అత్యాచారానికిపాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు నిం దితులను అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:31 AM