Share News

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ABN , Publish Date - May 13 , 2026 | 09:13 AM

ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి ఖాతాలోని నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగింది.

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ
SBI ATM

వికారాబాద్, మే13: ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగింది. మంగళవారం రైతు గొట్టిముక్కల హరినాథ్ నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లారు. అక్కడ ఉన్న వ్యక్తి సహాయం చేస్తానని హరినాథ్‌ను నమ్మించాడు. హరినాథ్ దృష్టి మరల్చి ఏటీఎం కార్డును కేటుగాడు మార్చేశాడు.


అనంతరం రైతు ఖాతా నుంచి రూ.7 వేలు నగదు స్వాహా చేశాడు. మీ ఖాతాలో కేవలం రూ.170 మాత్రమే ఉన్నాయంటూ హరినాథ్‌కు ఆగంతకుడు చెప్పాడు. నగదు చోరీ జరిగిన సంగతి తెలియని హరినాథ్.. బ్యాంకుకి వెళ్లి అధికారులను సంప్రదించాడు. ఏటీఎం ద్వారా మీ నగదు తీసుకున్నట్లు ఉందంటూ రైతుకు బ్యాంకు అధికారులు తెలిపారు.


దీంతో తన నగదు చోరీ అయిందని హరినాథ్ గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిగిలోని ఏటీఎంలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో దుండగుడి దృశ్యాలు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వవద్దని.. పిన్ నెంబర్లు చెప్పవద్దని బ్యాంకు ఖాతాదారులకు పోలీసులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నగరంలో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల సరఫరా

For More TG News And Telugu News

Updated Date - May 13 , 2026 | 02:01 PM