ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:51 AM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు.
మద్యం తాగించి నైలాన్ తాడుతో హత్య
అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి పరారీ
పోలీసుల దర్యాప్తు.. భార్య, ఇద్దరు నిందితుల అరెస్టు
కామారెడ్డి జిల్లా హన్మాజీపేటలో వీడిన హత్య కేసు మిస్టరీ
బాన్సువాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో జరిగిన గుమ్మడి కాశీరాం (26) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడి భార్య గుమ్మడి సవితతో పాటు చింతకింద రాము, పసుపుల సంతోష్‌షలను అరెస్టు చేశారు. శుక్రవారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. కాశీరాం భార్య సవితకు పసుపుల సంతోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సవిత.. సంతోష్‌తో పాటు చింతకింద రాముతో కలిసి హత్యకు పథకం వేసింది.
ఇందులో భాగంగా సంతోష్, రాము ఈనెల 23న రాత్రి కాశీరాంను మద్యం తాగుదామని చెప్పి గ్రామ శివారులోని పచ్చేరు చెరువు వద్దకు తీసుకెళ్లారు. కాశీరాం మద్యం మత్తులో ఉండగా రాము, సంతోష్ నైలాన్ తాడుతో అతడి మెడకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాశీరాం అనుమానాస్పద మృతిపై అతడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా అది హత్యగా నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను విశ్లేషించి సవిత, సంతోష్, రాముల పాత్రను గుర్తించారు. శుక్రవారం ముగ్గురినీ అరెస్టు చేసి, వారి నుంచి సెల్‌ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యారంటీ లేకుండానే రైస్ మిల్లు ఆస్తుల బదిలీ
క్యాన్సర్ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
బీఆర్‌ఎస్ కాపాడిన భూమిని.. రేవంత్ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News