నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్‌గా కళాసాగర్
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:55 AM
నిజామాబాద్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా కళాసాగర్ నియమితులయ్యారు.
వరంగల్ జైలుకు దశరథం...
కరీంనగర్‌కు వెంకటేశం
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా కళాసాగర్ నియమితులయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను నిజామాబాద్ జైలు కు బదిలీ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసి కొద్ది నెలలుగా పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న దశరథంకు వరంగల్ జైలు బాధ్యతలకు అప్పగించారు. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఎ. వెంకటేశంను కరీంనగర్ జిల్లా జైలుకు.. అక్కడ ఉన్న జి. విజయ్‌ని చర్లపల్లికి మార్చారు. వీరితోపాటు పరిగి, చర్లపల్లి నుంచి మరో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ డీజీ సౌమ్యామిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News