Share News

నిజామాబాద్‌ అడవుల్లో నెమళ్ల వేట కలకలం.. ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:19 PM

నిజామాబాద్ జిల్లాలో నెమళ్ల వేట కలకలం రేపింది. బాల్కొండ అటవీ ప్రాంతంలో నెమళ్ల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి రెండు నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్‌ అడవుల్లో నెమళ్ల వేట కలకలం.. ఇద్దరి అరెస్ట్
peacock hunting

నిజామాబాద్, నవంబర్ 13: జిల్లాలో నెమళ్ల వేట కలకలం రేపింది. బాల్కొండ అటవీ శివారు ప్రాంతంలో నెమళ్లను వేటాడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. ఇద్దరు వేటగాళ్లను అరెస్ట్ చేశారు.


వేటగాళ్ల నుంచి రెండు నెమళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నెమళ్లను వేటాడిన వ్యక్తులను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మేస్త్రీలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నెమళ్ల వేట ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది.. నెమళ్లను ఏం చేస్తున్నారు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్

ఏర్పాట్లలో ఎందుకింత నిర్లక్ష్యం..?

Updated Date - Nov 13 , 2026 | 09:20 PM