ఏర్పాట్లలో ఎందుకింత నిర్లక్ష్యం..?
ABN , Publish Date - Nov 13 , 2026 | 06:07 AM
గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
‘గ్లోబల్ సమ్మిట్’ పనుల కాంట్రాక్టర్‌పై సీఎస్ ఆగ్రహం
కందుకూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ముఖద్వారం కూడా పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయిలో పనిచేసే వారిని పంపించడంతో సీఎస్ మరింత మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేటలో వచ్చే నెల 7, 8, 9వ తేదీల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆవరణలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం క్షేత్రస్థాయిలో పనులను సీఎస్ పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈనెల చివరి నాటికి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.