Share News

వివాహితపై యాసిడ్ దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:40 PM

యాసిడ్ దాడి జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మరణించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో చోటు చేసుకుంది.

వివాహితపై యాసిడ్ దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

కామారెడ్డి, సెప్టెంబర్14: యాసిడ్ దాడి జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మరణించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం బిక్కనూరుకు చెందిన దివ్యవాణికి నిజామాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దివ్యవాణి పుట్టింటిలో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.


ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దివ్యావాణి కోసం భర్తతోపాటు కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి జంగంపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద కాలిన గాయాలతో దివ్యవాణిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. అయితే భర్తతోపాటు అత్తమామలు దాడి చేయడంతోనే తమ కుమార్తె మృతి చెందిందని దివ్యవాణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో వైపు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి..

తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద చిరుత కలకలం..

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 05:48 PM