తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్ద చిరుత కలకలం..
ABN , Publish Date - Sep 14 , 2026 | 10:29 AM
తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్‌గేట్‌కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది.
తిరుపతి జిల్లా: తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్‌గేట్‌కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది. ఆ సమయంలో నడకదారిలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఆ తర్వాత కాసేపు అక్కడే సంచరించిన చిరుత అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తరచూ తిరుమల ఘాట్ రోడ్లు, నడకదారుల పరిసరాల్లో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం