కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:43 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణేశ్ చతుర్ధి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలను అందించారు.
చిత్తూరు, సెప్టెంబర్ 14: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలను అందించారు. మంత్రితోపాటు స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మని నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆలయ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని కాణిపాకం శోభాయమానంగా మారింది. వివిధ పుష్పాలంకరణలు, వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. కాణిపాకం ఆలయానికి భక్తులు పోటెత్తారు. 21 రోజులు పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
Read Latest AP News And Telugu News