రాజగోపాల్, అనిరుధ్‌రెడ్డిపై ఏఐసీసీదే నిర్ణయం
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:51 AM
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
వారి వ్యాఖ్యలను పరిశీలిస్తోంది..
సరైన సమయంలో నిర్ణయం
నీటి వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: మహేశ్‌గౌడ్
నిజామాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యల గురించి ఏఐసీసీనే చూసుకుంటుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిలు చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని.. సరైన సమయంలో పార్టీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. నిజామాబాద్‌లో మహేశ్ గౌడ్ మాట్లాడారు. కొండా సురేఖ విషయంలో ఎందుకు చర్యలు తొందరగా తీసుకున్నారని ఈ సందర్భంగా విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా.. రెండు, మూడు సార్లు హెచ్చరించిన తర్వాతనే అధిష్ఠానం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు.
ఏపీ జలదోపిడీ చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. నీటి వాటాల విషయంలో ఒక్క బొట్టును కూడా వదులుకోబోమని, రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసే అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారని పదే పదే కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో పుట్టి సాదారణ జీవితం గడుపుతున్నారని.. వారికి మూటలు మోసే అవసరం ఏముందన్నారు. అవినీతి కుంభకోణాల్లో మునిగిన కేటీఆర్‌కు రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్ టికెట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News