Share News

యాదగిరిగుట్టలో కిక్కిరిసిన తిరువీధులు

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:47 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

యాదగిరిగుట్టలో కిక్కిరిసిన తిరువీధులు
Yadagirigutta Temple Crowd

  • భద్రాచలం రామయ్యను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి నందా

యాదాద్రి, భద్రాచలం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవులతో పాటు పండుగ సెలవులు కలిసిరావడంతో 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ తిరువీధుల్లో భక్తుల సందడి నెలకొంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో విశేష పూజలు అందుకున్నారు.


భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఆదివారం ఐశ్వర్య లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 19 , 2026 | 05:47 AM