యాదగిరికొండపై ‘కార్తీక’ శోభ
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:13 AM
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది.
కార్తీక తొలి సోమవారం పూజల సందడి
కార్తీకోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
యాదాద్రి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధనలు చేశారు. కొండపై గల పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్ఫటికలింగార్చన, అభిషేకం, అర్చనలు నిర్వహించారు.
ప్రధానాలయంలో లక్ష్మీనృసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వివిధ కైంకర్యాల ద్వారా రూ.60,25,391 ఆదాయం సమకూరిందని ఈవో భవానీశంకర్ తెలిపారు. వ్రత మండపంలో 714 మంది దంపతులు సత్యదేవుడి వ్రత పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో 20నుంచి 22వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించే కార్తీకోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో సమీక్షించారు. కాగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరను 2027 ఫిబ్రవరి 21నుంచి 25వ తేదీవరకు నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News