Share News

విషవాయువు లీకై కార్మికుడి మృతి

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:29 AM

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్‌ (సువెన్‌) ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై ఓ కార్మికుడు మృతిచెందాడు.

విషవాయువు లీకై కార్మికుడి మృతి
Suryapet Pharma Company Accident

  • సూర్యాపేటలోని కోహెన్స్‌ ఫార్మా కంపెనీలో ఘటన

సూర్యాపేటరూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్‌ (సువెన్‌) ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై ఓ కార్మికుడు మృతిచెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం సువెన్‌ కంపెనీలోని బ్లాక్‌-1లో గ్యాస్‌ లీకేజీ కావడంతో అక్కడ విధుల్లో ఉన్న అర్వపల్లి మండలం పర్సాయపల్లి గ్రామానికి చెందిన పుప్పాల వెంకన్న(41)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.


అక్కడ చికిత్స పొందుతూ అతడు శనివారం రాత్రి మృతిచెందాడు. జానావాసాల్లో నెలకొల్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కోహెన్స్‌ (సువెన్‌) ఫార్మా కంపెనీని వెంటనే శాశ్వతంగా మూసివేయాలని సీపీఐ(ఎంఎల్‌) మా్‌సలైన్‌, సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శులు కొత్తపల్లి శివకుమార్‌, బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఆ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయకపోతే ఉద్యమాలు కొనసాగిస్తామని ఫ్యాక్టరీ ఎదుట ఆదివారం నిర్వహించిన నిరసనలో హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:29 AM