అన్నంత పని చేశాడు..!
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:29 AM
‘మీరు బడి నుంచి వచ్చే సరికి మీ అమ్మను చంపేస్తా’ అని పిల్లలతో చెప్పిన తండ్రి , అన్నంత పనీ చేసి కట్టుకున్న భార్యను దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు.
నల్లగొండ జిల్లాలో హోంగార్డు దారుణ హత్య
మద్యానికి బానిసై భార్యను పొట్టనబెట్టుకున్న భర్త
నల్లగొండ క్రైం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘మీరు బడి నుంచి వచ్చే సరికి మీ అమ్మను చంపేస్తా’ అని పిల్లలతో చెప్పిన తండ్రి , అన్నంత పనీ చేసి కట్టుకున్న భార్యను దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు. మద్యానికి బానిసై, బాధ్యత మరిచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మహిళా హోంగార్డు మహబూబ్‌బీ(39) జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న శిశుమందిర్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన వడ్డే సతీశ్‌ను 15సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
సతీష్ తాగుడుకు బానిస కావడంతో కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో కూడా వీరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో ‘మీరు బడి నుంచి వచ్చేసరికి మీ అమ్మను చంపేస్తా’ అని పిల్లలకు చెప్పాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ మళ్లీ గొడవపడి, మహబూబ్‌బీ మెడ నులిమి, తలను నేలకేసి బలంగా కొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లి మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అందరినీ కలచి వేసింది. పోలీసులు.. నిందితుడు సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News