ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:01 AM
ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఈ నెల 20న ఏకపక్షంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్స్’ సంస్థ ప్రతినిధి కె.బాబూరావు డిమాండ్ చేశారు.
హెచ్‌ఆర్సీకి సైంటిస్ట్స్ ఫర్ పీపుల్స్ ఫిర్యాదు
నల్లగొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఈ నెల 20న ఏకపక్షంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్స్’ సంస్థ ప్రతినిధి కె.బాబూరావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. పోలీసుల తనిఖీ మధ్య ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని అంచనా వేసిన కొందరు వ్యక్తులను వేదిక వద్దకెళ్లకుండా నియంత్రించి.. ముందుగా ఎంపిక చేసిన వారినే అనుమతించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
లిఖిత పూర్వక విశ్లేషణతో తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్న రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్ కన్నెగంటి రవితోపాటు టీపీజేఏసీ, టీవీవీ, మానవ హక్కుల వేదిక నాయకులకు చివరి వరకూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. మధ్యాహ్నానికే ప్రజాభిప్రాయ సేకరణ ముగిస్తున్నట్లు ఏకపక్షంగా ఆర్డీవో ప్రకటించారన్నారు. ఏకపక్ష ప్రజాభిప్రాయ సేకరణపై విచారణ జరిపించి.. తిరిగి చేపట్టాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News