Share News

నల్లగొండలో కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:27 PM

కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్‌ నాటికి మూడేళ్లు పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో లేని పథకాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

నల్లగొండలో కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy

నల్లగొండ, సెప్టెంబర్ 14: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్‌ నాటికి మూడేళ్లు పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈరోజు(సోమవారం) ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. దేశంలో లేని పథకాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నల్లగొండలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రతి మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు రెండేళ్లలో డబుల్ రోడ్లు నిర్మిస్తామని.. హడ్కో రుణంతో హ్యామ్ రోడ్ల పనులను చేపడుతున్నామని తెలిపారు. రోడ్లు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.


రూ.12,073 కోట్లతో హైదరాబాద్ -విజయవాడ ఆరు లైన్లకు వచ్చే నెల(అక్టోబర్) టెండర్లను పిలిపించనున్నట్లు మంత్రి తెలిపారు. జనవరిలో పనులను మొదలు పెట్టి 18 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. కేటీఆర్ నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేస్తే... తాను చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యను హత్య చేసిన భర్త

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు.. వాహనదారులకు అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 12:27 PM