Share News

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Sep 14 , 2026 | 10:48 AM

పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హైవేపై ద్విచక్రవాహనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Road Accident

పల్నాడు, సెప్టెంబర్ 14: జిల్లాలోని రొంపిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హైవేపై ద్విచక్రవాహనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు(సోమవారం) ఉదయం రామాంజనేయులు(40), వెంకట ఆంజనేయులు బైక్‌‌లో హైవేపై వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


మృతులు ఈపూరు మండలం ఇనిమెళ్ల వాసులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రొంపిచర్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 10:53 AM