Share News

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు.. వాహనదారులకు అలర్ట్

ABN , Publish Date - Sep 14 , 2026 | 11:03 AM

ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈఏడాది 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణేశుడుని తీర్చిదిద్దారు. ఈరోజు(సోమవారం) ఉదయం మహా గణపతికి తొలిపూజ నిర్వహించనున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు.. వాహనదారులకు అలర్ట్
Khairatabad Ganesh 2026

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈఏడాది 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణేశుడిని తీర్చిదిద్దారు. ఈరోజు(సోమవారం) ఉదయం మహా గణపతికి తొలిపూజ నిర్వహించనున్నారు. తొలిపూజలో గవర్నర్ శివప్రసాప్ శుక్లా పాల్గొననున్నారు. ఇక గణేశ్ ఉత్సవాల సందర్భంగా నేటి(సోమవారం) నుంచి సెప్టెంబర్ 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు.


వీవీ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నిరంకారి జంక్షన్ వైపు, పాత పీఎస్ సైఫాబాద్ వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు ట్రాఫిక్‌కు అనుమతిని నిరాకరించారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఖైరతాబాద్, సైఫాబాద్, మింట్ కాంపౌండ్, NTR మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండటంతో... వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. భక్తుల కోసం రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన HMDA పార్కింగ్, విశ్వేశ్వరయ్య భవన్‌లలో ప్రత్యేక పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి...

కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

హైదరాబాద్‌లో ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యను హత్య చేసిన భర్త

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 11:31 AM