న్యూజిలాండ్‌కు ‘దండుమల్కాపూర్’ ఉత్పత్తులు
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:31 AM
యాదాద్రిజిల్లా నుంచి న్యూజిలాండ్‌కు సరుకులు రవాణా కానున్నాయి.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో నేడు తొలిసారిగా ఎగుమతులకు శ్రీకారం
యాదాద్రి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): యాదాద్రిజిల్లా నుంచి న్యూజిలాండ్‌కు సరుకులు రవాణా కానున్నాయి. భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా తొలి ఎగుమతికి చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వేదిక కానుంది. ఇక్కడి ఫ్రూమర్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సోమవారం న్యూజిలాండ్‌కు సరుకు వెళ్లనుంది.
ఈ మేరకు విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీఎ్‌ఫటీ) ఆదివారం ప్రకటన జారీ చేశారు. ఎఫ్టీఏతో సుంకం లేకుండా న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. దండుమల్కాపూర్ నుంచి పాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయాధారిత ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి. ఇది జిల్లా పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలపై ఆశలు రేకెత్తిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్కో నుంచే...
అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International