సీఎంఆర్ ధాన్యం దారిమళ్లింపు.. మిల్లు భాగస్వాములపై కేసు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:31 AM
రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గంపా నాగేందర్‌కు చెందిన యాదాద్రి జిల్లా కేంద్రం రాయగిరిలోని శివ పారాబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీలో 6,302.08 మెట్రిక్‌టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలకు ..
జరిమానా, ధాన్యం విలువ కలిపి 23 కోట్లు
యాదాద్రి జిల్లా రాయగిరిలో గుర్తింపు
ఇద్దరిపై కేసు.. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి
హైకోర్టులో భాగస్వాముల పిటిషన్.. అరెస్టు వద్దంటూ తీర్పు
యాదాద్రి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గంపా నాగేందర్‌కు చెందిన యాదాద్రి జిల్లా కేంద్రం రాయగిరిలోని శివ పారాబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీలో 6,302.08 మెట్రిక్‌టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి మిల్లు భాగస్వాములు గంపా నాగేందర్, మంచాల రవీందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం విధించిన జరిమానా, దారిమళ్లించిన ధాన్యం విలువను రూ.23.03 కోట్లుగా పౌరసరఫరాల సంస్థ గుర్తించింది.
ఈ మేరు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దాచేపల్లి హరికృష్ణ, ఆ ఇద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. గంపా నాగేందర్, మంచాల రవీందర్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి పోలీసులపై ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. ధాన్యానికి సంబంధించిన విలువను ప్రభుత్వానికి కట్టడానికి వారుసిద్ధంగా ఉన్నారంటూ సదరు బడా వ్యక్తులు చెప్పడంతో ఆ ఇద్దరిని పోలీసులు విచారణ చేయకుండానే తిరిగి పంపించినట్టు తెలుస్తోంది.
మరోవైపు నాగేందర్, రవీందర్‌ను విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించడంతో వెంటనే వారి తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. తాము సంఘంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నామని, అరెస్టు చేయకుండా ఉండేందుకు పోలీసులను ఆదేశించాలని వారు కోరారు. దీంతో హైకోర్టు వారిని అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పనిచేసి ఫలితం చూపించినవారికే ప్రజాదరణ
అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే దుష్ప్రచారమా?
స్వచ్ఛంద సమాచార వెల్లడితో.. ఆర్టీఐ దరఖాస్తుల భారం తగ్గుతుంది!
Read Latest AP News And Telangana News And International News And Telugu News