Share News

పనిచేసి ఫలితం చూపించినవారికే ప్రజాదరణ

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:18 AM

తమ కోసం నిబద్ధతతో పనిచేసి ఫలితాలు చూపించేవారినే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

పనిచేసి ఫలితం చూపించినవారికే ప్రజాదరణ
Bandi Sanjay

  • తాజా ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం: బండి సంజయ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తమ కోసం నిబద్ధతతో పనిచేసి ఫలితాలు చూపించేవారినే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తాజా ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రచారం, తప్పుడు ఆరోపణలతో కాలం వెళ్లదీసే రాజకీయాలకు, ప్రజల కోసం పనిచేసే విధానానికి మధ్య తేడాను ఓటర్లు స్పష్టంగా గుర్తిస్తున్నారని సంజయ్‌ తెలిపారు.


అందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమికి వరుస విజయాలు దక్కుతున్నాయని అన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిసారీ ‘‘వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు’’ అంటూ రాహుల్‌గాంధీ, ఇండి కూటమి నాయకులు నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇండి కూటమి అబద్ధాలు, వివాదాల సృష్టి కంటే, ప్రధాని మోదీ నాయకత్వంపైనే భారత ప్రజలు అపారమైన విశ్వాసం ఉంచుతున్నారని సంజయ్‌ ఎక్స్‌ వేదికగా వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే దుష్ప్రచారమా?

రూ.1000 కోట్ల లావాదేవీలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:19 AM