యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - May 23 , 2026 | 10:23 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
యాదాద్రి, మే 23: యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శనివారం) ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం.. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేదపాఠశాలకు భూమిపూజ చేశారు. అనంతరం రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పై కప్పు నిర్మాణానికి, రూ.1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
హెలికాఫ్టర్లో యాదాద్రికి సీఎం...
ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట పెద్దగుట్టపైకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేంనరేందర్ రెడ్డి.. యాదాద్రికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి...
టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్
నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ
Read Latest Telangana News And Telugu News