Share News

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువే

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:47 AM

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అది ఏ ఇతర పార్టీలో ఉండదని.. అలాగని హద్దులు దాటి మాట్లాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువే
Mahesh kumar Goud

  • హద్దులు దాటితే ఎవర్నైనా సహించం

  • కొండా సురేఖ, ఇతర నేతలపై క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీలదే తుది నిర్ణయం

  • రాజయ్య, ఈటలను అర్థరాత్రే బీఆర్‌ఎస్‌ నుంచి గెంటేయలేదా..?

  • మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా బీజేపీలో ఎవరైనా మాట్లాడగలరా..?

  • సురేఖ, ఇతర నేతలపై క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీలదే తుది నిర్ణయం: మహేశ్‌ గౌడ్‌

నిజామాబాద్‌: కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అది ఏ ఇతర పార్టీలో ఉండదని.. అలాగని హద్దులు దాటి మాట్లాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను, ఈటల రాజేందర్‌ను అర్ధరాత్రే గెంటేయలేదా..? బీజేపీలో మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలరా..? అని ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రె్‌సలో ఉన్న స్వేచ్ఛ ఇతర ఏ పార్టీలో ఉండదన్నారు. పార్టీలో ఏవైనా ఇబ్బందులుంటే తనకు గానీ, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌కు గానీ లేదా కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గేల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప పార్టీ లైన్‌ దాటి బహిరంగ విమర్శలు చేస్తే అస్సలు సహించబోమని తేల్చి చెప్పారు. నామినేటెడ్‌ పదవుల భర్తీలో కాంగ్రెస్‌ కోసం కష్టపడిన వారికే పదవులు ఉంటాయని.. పాత నేతలకు 80 శాతం పదవులు, కొత్త నేతలకు 20 శాతం పదవులు ఇస్తామని తెలిపారు. కొండా సురేఖ, ఇతర నేతల విషయంలో క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీలు తుది నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.


వీటిని కూడా చదవండి

నేటి రాశి ఫలాలు... 24-08-2026

చీరాల తీరంలో భారీ కోత!

Updated Date - Aug 24 , 2026 | 06:43 AM