ఆడుకోవడానికి వెళ్లిన అరగంటలోనే..
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:05 AM
లిఫ్ట్‌లో నుంచి కింద పడి ఓ బాలిక మృతి చెందింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డు కొత్తపేటలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
లిఫ్ట్‌లో నుంచి పడి బాలిక మృతి!
అనుమానం ఉందంటూ తండ్రి ఫిర్యాదు
సత్తెనపల్లి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): లిఫ్ట్‌లో నుంచి కింద పడి ఓ బాలిక మృతి చెందింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డు కొత్తపేటలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. భవిరిశెట్టి ఆనంద మహేశ్ కుమార్తె రేవతి (12) సమీపంలోని దోరెండ్ల కోటేశ్వరరావు గృహంలో పిల్లలతో ఆడుకొనేందుకు వెళ్లింది. 4.30 గంటల సమయంలో కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు.. రేవతి లిఫ్ట్‌లో నుంచి పడి మృతి చెందినట్టు బాలిక కుటుంబ సభ్యులకు తెలిపారు. బాలిక తలకు, ముఖంపై గాయాలున్నట్లు సమాచారం. తండ్రి ఆనంద్ మహేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ చైతన్య ఘటనా స్థలానికి వెళ్ళి విచారణ జరిపారు. బాలిక ఎలా చనిపోయిందో సమగ్ర దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.