Share News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:25 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని పవిత్ర మండపంలోని..

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనాన్ని చేపట్టారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం స్వామిఅమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం పవిత్ర సమర్పణ నిర్వహించనున్నారు. జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 05:27 AM