Share News

వెటర్నరీ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:23 AM

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బొబ్బిలి రాజేందర్‌..

వెటర్నరీ పాలిటెక్నిక్‌  ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు
Siddipet POCSO Case

  • విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌

చిన్నకోడూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బొబ్బిలి రాజేందర్‌.. మూడు నెలలుగా క్లాస్‌ రూమ్‌లలో విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు.


అంతేకాకుండా సాయంత్రం వేళల్లో వారి హాస్టల్‌ గదుల్లోకి వెళ్లి వ్యక్తిగత విషయాలు అడగడంతో పాటు, వారిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన యూనివర్సిటీ.. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:23 AM