Share News

సిద్దిపేట కోటలకు బీటలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:50 AM

సిద్దిపేట పోరాటాల అడ్డా అని.. ఇక్కడి కోటలకు, కుటుంబ పాలనకు నూకలు చెల్లాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

సిద్దిపేట కోటలకు బీటలు
Mahesh Kumar Goud

  • కుటుంబ పాలనకు చరమగీతం

  • సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ జైత్రయాత్ర

  • పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

సిద్దిపేట కల్చరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట పోరాటాల అడ్డా అని.. ఇక్కడి కోటలకు, కుటుంబ పాలనకు నూకలు చెల్లాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. సిరిసిల్లలో మొదలైన కాంగ్రెస్‌ జైత్రయాత్ర సిద్దిపేటకు చేరిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి కుటుంబ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రూ.5 లక్షల కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు కొల్లగొట్టారని, మల్లన్నసాగర్‌ కోసం గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేయించారని ఆరోపించారు. వేల కోట్ల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి పోయిందో సిద్దిపేట ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 03:50 AM