హుస్నాబాద్‌ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపండి: సీఎంకి పొన్నం విజ్ఞప్తి
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:58 PM
హుస్నాబాద్‌ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని పేర్కొన్నారు.
సిద్దిపేట, నవంబర్19: హుస్నాబాద్‌ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఆయన ఈ అంశాన్ని తీసుకెళ్లారు. హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో బలవంతంగా కలిపారని విమర్శించారు. బలవంతపు పెళ్లి ఎక్కువ కాలం నిలువదని ఈ సందర్బంగా మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. అనంతరం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో చేర్చారు. కానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాంటూ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో జిల్లాల సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ చేపడితే.. హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని పొన్నం ప్రభాకర్ గతంలో స్పష్టం చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఎకరాల్లో పంటలు దగ్ధం
రహదారుల నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దు: ఇంజినీర్లకు కేంద్రమంత్రి సూచన
For More TG News And Telugu News