రహదారుల నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దు: ఇంజినీర్లకు కేంద్రమంత్రి సూచన
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:48 PM
రహదారుల నిర్మాణాల్లో నాణ్యత, భద్రత, మన్నిక విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని ఇంజినీర్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు.
హైదరాబాద్, నవంబర్19: రహదారుల నిర్మాణాల్లో నాణ్యత, భద్రత, మన్నిక విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని ఇంజినీర్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పూర్తి బాధ్యత తీసుకుని సంపూర్ణంగా పూర్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంజినీర్లకు చురకలంటించారు. ఫ్లై ఓవర్ నిర్మించాల్సిన చోట నిర్మించం, అండర్‌పాస్ ఇవ్వాల్సిన చోట ఇవ్వం, జంక్షన్ల గురించి పట్టించుకోమని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆ ప్రమాదాలకు మనమే బాధ్యులమని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. దీనిపై మీలో కచ్చితంగా బాధ్యతాయుతమైన ధోరణి రావాలని అన్నారు. అయితే కొంచెం కఠినంగా మాట్లాడి ఉంటే తనను క్షమించాలని ఇంజినీర్లను కోరారు. దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఐఆర్‌సీలోని ప్రతి ఇంజనీర్ నిబద్ధత, బాధ్యత, సహకారం తనకు కావాలని తెలిపారు. తెలంగాణ కోసం తన వంతుగా మీకు ఎంత సహాయం చేయగలనో అంత వరకు చేస్తానని రేవంత్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్
For More TG News And Telugu News