Share News

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:36 PM

హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ (ఆర్‌యూబీ) పునరుద్ధరణ పనులు శుక్రవారం (నవంబర్ 20) నుంచి ప్రారంభం కానున్నాయి.

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్

హైదరాబాద్, నవంబర్19: నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ (ఆర్‌యూబీ) పునరుద్ధరణ పనులు శుక్రవారం (నవంబర్ 20) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌యూబీ మూసి వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆర్‌యూబీలో కేవలం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకే అనుమతి ఇస్తామని చెప్పారు. ఇక ఈ మార్గంలో భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ట్రావెల్ బస్సులకు అనుమతి లేదని వివరించారు. రాణిగంజ్, ఎంజీ రోడ్డు, ట్యాంక్ బండ్, కర్బలా మైదాన్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.


భారీ వాహనాలను పలు జంక్షన్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లీస్తామని పేర్కొన్నారు. SBI చౌరస్తా, ప్యాట్నీ, ప్యారడైజ్, పార్క్‌లేన్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మళ్లీస్తామని అన్నారు. నల్లగుట్ట నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వాహనాల మళ్లీస్తామని చెప్పారు. ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్‌పురా సహా ఐదు జంక్షన్ల వద్ద 10 అడుగుల హైట్ రిస్ట్రిక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీ ఉండే 18 జంక్షన్లను నివారించాలని ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ముందుగానే ప్రయాణానికి సంబంధించన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాణిగంజ్‌లోని ఆర్‌యూబీని దాదాపు 6 నుంచి 8 నెలల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని నగర ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్ సర్కార్ పనితీరుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శం: హరీష్ రావు

నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్

For More TG News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 03:44 PM