రేవంత్ సర్కార్ పనితీరుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శం: హరీష్ రావు
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:46 PM
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు నీటి ప్రాజెక్టులపై అవగాహన లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆయన అజ్ఞానానికి చింతిస్తున్నానని అన్నారు. పాలమూరు, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు.
హైదరాబాద్, నవంబర్19: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు నీటి ప్రాజెక్టులపై అవగాహన లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆయన అజ్ఞానానికి చింతిస్తున్నానని అన్నారు. పాలమూరు, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. తమ అధికారానికి కాపాడుకోవటానికి ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఖాళీ అయితే నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత జిల్లాకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ పనితీరుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు.
కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం ఇన్‌టేక్ వెల్ (Intake Well) నిర్మిస్తుంటే రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని హరీష్ రావు తెలిపారు. ఇన్‌టేక్ వెల్ వలన రోజుకు 2 టీఎంసీలు నీరు ఏపీ తీసుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ల మీద ఉన్న ధ్యాస రేవంత్ సర్కార్‌కు నీటి విషయంలో లేదని అన్నారు. నీళ్ల విషయంలో రేవంత్ సర్కార్ అట్టర్ ప్లాప్ అయిందని అభివర్ణించారు. తెలంగాణ నీటి హక్కుల మీద ఈ ప్రభుత్వానికి ధ్యాస లేదని ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో వాడిన దాని కంటే.. కాంగ్రెస్ హయాంలోనే తక్కువ నీటి వాడకం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అక్రమాస్తుల కేసు.. స్టేటస్ రిపోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. బిర్యానీ తిన్న 9 మందికి తీవ్ర అస్వస్థత..
For More TG News And Telugu News