Share News

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:00 PM

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గురువారం విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

హైదరాబాద్, నవంబర్19: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారాల్లో కూడా నిర్వహిస్తారు. అయితే ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఇదే టైం టేబుల్ వర్తిస్తుంది. వారి పరీక్షల టైం టేబుల్ మాత్రం వేరుగా విడుదల చేయనున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇంటర్మీడియట్ బోర్డు వివరించింది.


null

ఈ వార్తలనూ చదవండి:

మిడ్‌టర్మ్ ఫలితాలు.. యూఎస్‌పై అంతర్జాతీయ విద్యార్థుల్లో మళ్లీ ఆశలు

మే 23న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

Updated Date - Nov 19 , 2026 | 05:03 PM