మిడ్‌టర్మ్ ఫలితాలు.. యూఎస్‌పై అంతర్జాతీయ విద్యార్థుల్లో మళ్లీ ఆశలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:38 PM
మిడ్‌టర్మ్ ఫలితాల నేపథ్యంలో అమెరికాపై అంతర్జాతీయ విద్యార్థుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: మిడ్‌టర్మ్ ఫలితాల నేపథ్యంలో అమెరికాపై అంతర్జాతీయ విద్యార్థుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. ఇటీవల మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు అధికార రిపబ్లికన్లపై పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారంలో రోజుల్లోనే అమెరికా చదువులపై అంతర్జాతీయ విద్యార్థుల్లో ఆస్తకి 40 శాతం వరకూ పెరిగినట్టు స్టడీ పోర్టల్స్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది.
గత రెండేళ్లుగా అమెరికాపై అంతర్జాతీయ విద్యార్థుల్లో ఆశలు తగ్గుతూ వస్తున్నాయని సంస్థ పేర్కొంది. అమెరికాలో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేయాలని భావించే వారి సంఖ్య 38 శాతం తగ్గిందని చెప్పింది. 2025 ఆటమ్ అడ్మిషన్ సీజన్‌లో యూఎస్ యూనివర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19 శాతం మేర తగ్గిందని సంస్థ పేర్కొంది.
రాజకీయ మార్పులకు విద్యార్థులు త్వరగా స్పందిస్తారని స్టడీపోర్టల్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు ఎడ్విడ్ వాన్ రెస్ట్ తెలిపారు. ‘ఇది అటు అంతర్జాతీయ విద్యార్థులకూ, ఇటూ అమెరికా యూనివర్సిటీలకు, అమెరికా పరిశ్రమలకు, వాణిజ్యానికి శుభవార్తే. పలు రంగాల్లో నిపుణుల కొరత ఉంది’ అని అన్నారు. ఆసక్తి పెరిగిన నేపథ్యంలో త్వరిత గతిన వీసాలు, అడ్మిషన్లు జరగాలని కోరారు. ఆసక్తి పెరిగినంత మాత్రాన అడ్మిషన్లు అదే స్థాయిలో ఉంటాయని చెప్పలేమని స్టడీపోర్టల్స్ సంస్థ పేర్కొంది. యూనివర్సిటీని ఎంచుకునే ముందు విద్యార్థులు నెలల తరబడి ఆన్‌లైన్‌లో సమాచారం సేకరిస్తారని వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..